టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర రేపు ఉదయం కుప్పంలో స్టార్ట్ కానుంది.రేపు ఉదయం 10:15 సమయానికి వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
అనంతరం ఉదయం 11 గంటలకు నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ కానుంది.మొత్తం 400 రోజులపాటు జరగనున్న ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ లు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.
పాదయాత్ర మొదటి రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సభ అనంతరం కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లి క్రాస్, మిగిలి పల్లె క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.అనంతరం రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.మొదటిరోజు 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.కుప్పం నుండి రేపు జరగనున్న లోకేష్ పాదయాత్రకి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నందమూరి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.