'రుషివనంలో'.. మణిశర్మ క్లాసిక్ హిట్స్ లో చేరిపోవడం ఖాయం!

సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Rushivanamlona Melody Of Shakuntalam Details, Mani Sharma, Shakuntalam, Rushivan-TeluguStop.com

విడాకుల తర్వాత పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.

బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.

అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.

చాలా రోజుల పాటు ఈమె దీనితో పోరాడి దీని నుండి బయట పడింది.ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో చేరింది.ఇదిలా ఉండగా ఈమె నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.ఈ సినిమాను ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Telugu Mani Sharma, Rushivanamlona, Samantha, Shaakuntalam, Shakuntalam, Sid Sri

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.మరి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడానికి సిద్ధం అవుతున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు.రుషివనంలోనా. అనే రెండవ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయగా.ఇది మణిశర్మ క్లాసిక్ బాణీల్లో ఒకటిగా నిలిచి పోతుంది అనేలా ఆహ్లాదంగా సాంగ్ సాగుతుంది.

Telugu Mani Sharma, Rushivanamlona, Samantha, Shaakuntalam, Shakuntalam, Sid Sri

చిన్మయి, సిద్ శ్రీరామ్ అద్భుతమైన గానం ఎంతో ఆహ్లాదకంగా లయబద్ధంగా ఉండడంతో ఈ పాట ఎంతో బాగా ఆకట్టు కుంటుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.అలాగే ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.చూడాలి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube