హైదరాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత మరింత ఆలస్యం కానుంది.భవనంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు భవనం కూల్చివేతకు వచ్చిన భారీ క్రేన్ లో ఆయిల్ లీకేజీ అవుతోంది.
దీంతో ఏజెన్సీ మరో క్రేన్ ను తెప్పిస్తున్నామని తెలిపింది.ఏదీ ముందు వస్తే దాంతో కూల్చివేత పనులను ప్రారంభిస్తామని వెల్లడించింది.







