రాజమౌళి సర్ ఇది మీకోసమే... రాజమౌళికి ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసిన సుకుమార్!

లెక్కల మాస్టర్ గా క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే ఈయన సినిమాలు మాత్రమే కాకుండా వేదికల పైన సోషల్ మీడియా వేదికగా ఇచ్చే స్పీచ్ లు కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పాలి.

 Rajamouli Sir This Is For You Sukumar Arranged A Special Chair For Rajamouli, Ra-TeluguStop.com

ఇక ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుకుమార్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఇదివరకే ఎన్నో పోస్టులు చేశారు.

Telugu Natu Natu Oscar, Rajamouli Sir, Chair, Sukumar-Movie

ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా నుంచి ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ విజయంపై సుకుమార్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా జక్కన్న పై ప్రశంసలు కురిపించారు.సుకుమార్ ఒక మీటింగ్ రూమ్ లో తన బృందంతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోలో ఒక కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది.అయితే అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ గురించి సుకుమార్ ఎంతో అద్భుతంగా వివరణ ఇచ్చారు.

Telugu Natu Natu Oscar, Rajamouli Sir, Chair, Sukumar-Movie

ఇన్ని రోజులపాటు నా బృందంతో కలిసి జరిపిన చర్చలు, సమావేశాలలో అసంకల్పితంగా ప్రిన్సిపల్ కుర్చీనీ ఖాళీగా వదిలేశాను.అయితే ఆ కుర్చీను ఎందుకు అలా ఖాళీగా వదిలేసామో నాకు ఇప్పుడు అర్థమైంది.రాజమౌళి సార్ ఇది మీకోసమే ఈ కుర్చీ ఎప్పటికైనా మీదే అంటూ రాజమౌళి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నాటు నాటు పాటకు కారణమైనటువంటి వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.

దీంతో సుకుమార్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube