బాలీవుడ్ సినిమాలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. వీడియో వైరల్?

సినిమా ఇండస్ట్రీలో అదృష్టంతో పాటు టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని అంటూ ఉంటారు.అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అంతా ఇండియన్స్ సినిమాగా అవతరిస్తున్నడంతో టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి.

 Director N Shankar Launched Kaala Barbarian Chapter 1 Trailer, N Shankar, Kaala-TeluguStop.com

అయితే టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి అని తాజాగా కరీంనగర్ కి చెందిన కుర్రాడు రుజువు చేశాడు.కాలా బార్బేరియన్ చాప్టర్ 1 అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని డైరెక్టర్ ఎన్ శంకర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Telugu Kaalabarbarian, Karimnagar, Shankar, Pragnan-Movie

ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.అయితే ఇందులో విలన్ గా కరీంనగర్ కు చెందిన కుర్రాడు నటించాడు.ఆ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞాన్ గురించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అసలు ఈ ప్రజ్ఞాన్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశాడా అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు.

ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.ప్రజ్ఞాన్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు సినిమాల్లో నటించాడు.

Telugu Kaalabarbarian, Karimnagar, Shankar, Pragnan-Movie

ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు.ఆ తర్వాత కొందరు స్టూడెంట్స్ తో కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫిలిమ్స్ అనే పతకంపై కాలా బార్బెరియన్ అనే సినిమాను నిర్మించారు.ఈ సినిమాను తెలుగు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.ఇందులో మంచి స్కోప్ ఉన్న విలన్ పాత్రలో ప్రజ్ఞాన్ నటించాడు.తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ని చూసి ప్రజ్ఞాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే దర్శకుడు ఎన్ శంకర్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ప్రజ్ఞాన్ గురించి మాట్లాడుతూ ప్రజ్ఞాన్ నటనపై ప్రశంసలు కురిపించారు.ప్రజ్ఞాన్ కి సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube