కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని న్యాయవాది కోర్టుకు వివరించారు.
దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు.వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.







