వైరల్: స్పూన్ తో దిమ్మతిరిగే 'హెయిర్ కటింగ్' ఎలా చేసేస్తున్నాడో చూడండి!

సోషల్ మీడియా జనాలకి అందుబాటులోకి వచ్చిన నాటినుండి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్ల గురించి ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ముఖ్యంగా ఇలాంటి వీడియోలు నెటిజన్లు చాలా ఆసక్తిగా చూస్తారు.

 Viral See How He Does The Amazing 'hair Cutting' With A Spoon , Spooon, Hair Cut-TeluguStop.com

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సాధారణంగా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఏ బార్బర్ షాపుకి వెళ్లి, అక్కడ మనకు నచ్చిన చిత్ర విచిత్రమైన హెయిర్ కట్స్ చేయించుకుంటాం.

అయితే ఈ క్రమంలో బార్బర్ హెయిర్ కట్ కోసం వాడేది కత్తెరే కదా!.

కానీ ఇక్కడి వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఈ వీడియో కనిపించే వ్యక్తి డిఫరెంట్ గా హెయిర్ కట్ చేసి వార్తల్లోకి ఎక్కాడు.అవును, అమెరికాలోని ఓ వ్యక్తి కిచెన్‌ స్పూన్‌తో తన కుమారుడికి హెయిర్‌కట్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న సదరు వీడియోని ఒక్కసారి గమనిస్తే, చిన్న పిల్లాడు కటింగ్ షాపులో మాదిరిగా ఓ కుర్చీలో చక్కగా కూర్చుంటాడు.

ఇంతలో తండ్రి కిచెన్ లో లభించే స్పూన్ తో బాలుడి వద్ద ప్రత్యక్ష్యమవుతాడు.

ఆ వెంటనే ఆ స్పూన్ తో తన కుమారుడి హెయిర్ కట్ చేయడం మొదలు పెడతాడు.చూస్తుండగానే నిమిషాల్లోనే అదిరిపోయే హెయిర్ కటింగ్ చేసి ఆ పిల్లాడిని ఆశ్చర్య పరుస్తాడు.అంతేనా, అది చూసి మన నెటిజన్లు కూడా బిత్తరబోతున్నారు.

సదరు వ్యక్తి వీడియోని పోస్టు చేస్తూ… “నేను నా అబ్బాయి జుట్టును చెంచాతో కత్తిరించాను.నేను ఇప్పుడు జుట్టు కత్తిరింపులపై మ్యాజిక్‌లు చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి” అని తన పోస్ట్‌కు క్యాప్షన్‌లో ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ చాలా డిఫెరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు.వావ్.

నీ ఐడియాకు ఫిదా! అంటూ కామెంట్స్ చేస్తుండడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube