అదేంటి, దేవుడికి సిగరెట్ ఇష్టమేమిటి అని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే.సాధారణంగా ఏ దేవుడికైనా, దేవతకైనా పువ్వుల, అరటి వంటి పండ్లు నైవేద్యంగా పెడతారు.
కానీ ఎన్నో ఆచారాలు.సంప్రదాయలు గల భారత్ లో కొన్ని వింత ఆచారాలు కూడా అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటాయి.
ఒక్కో దేవతా ప్రతిమల దగ్గర మద్యాన్ని ప్రసాదంగా పెడితే, కొన్ని చోట్ల చాక్లెట్లను ప్రసాదంగా, మటన్ బిర్యానీని కొన్ని చోట్ల… ఇలా భారతదేశంలోని వింత ఆచారాలు గురించి మీరు ఎక్కడో ఒకచోట వినే వుంటారు.

అటువంటి ఓ వింత ఆచారంలో ఒకటే ఈ సిగరెట్ వ్యవహారం.మధ్యప్రదేశ్‌లోని సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయంలో దేవుడి ముందు ‘సిగరెట్’ వెలగించి మరీ భక్తులు తమ కోరికలు గురించి చెప్పుకుంటూ వుంటారు.ఆ కోరిక తీరాక భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట.
‘మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం’ అనేమాటే గానీ ఇక్కడ పెద్ద దేవాలయం అంటూ ఏది ఉండదు.ఓ మర్రిచెట్టుకింద ఉంటుందీ చిన్న ఆలయం.అలాగే ఇక్కడ పూజారులు కూడా ఎవ్వరు ఉండరు.యక్షుడే దేవుడుగా ఉంటాడని నమ్ముతారు.

అలాగే ఈ మర్రిచెట్టు అనేకరకాల గడియాలతో నిండిపోయి ఉండటంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ మనే శబ్ధం కోలోమీటరు వరకు వినిపిస్తుంటుంది.ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్ రోడ్డు పక్కన ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం కొలువై ఉంది.కోరుకున్న కోరికలు తీరిన అనంతరం.భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను సమర్పిస్తారు.దీంతో అక్కడి రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది.ఈ దేవాలయం 10 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిందట.







