జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లలో రీతూ చౌదరి ఒకరు.రీతూ చౌదరికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదనే సంగతి తెలిసిందే.
తాజాగా రీతూ చౌదరి తండ్రి హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు.తండ్రి చనిపోవడం రీతూ చౌదరిని ఎంతగానో బాధ పెట్టింది.
తండ్రిని తలచుకుంటూ రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
రీతూ చౌదరి సోషల్ మీడియాలో తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు.
నాన్నతో కలిసి దిగిన ఫోటోను ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు.నీతో దిగిన చివరి ఫోటో ఇదేనంటూ రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యారు.
నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావంటూ ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

నువ్వు లేకుండా నేను ఉండలేనని నీ కూతురి దగ్గరకు తిరిగిరా డాడీ అంటూ రీతూ చౌదరి పేర్కొన్నారు.రీతూ చౌదరి తండ్రి మరణ వార్త ఇతర జబర్దస్త్ కమెడియన్లను సైతం ఎంతగానో బాధ పెట్టింది.తండ్రి లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న రీతూ చౌదరి తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
రీతూ చౌదరి ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రీతూ చౌదరికి దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.రీతూ చౌదరి తండ్రి మరణం గురించి తెలిసి కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.రీతూ చౌదరికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.