భారతీయ రైల్వే వ్యవస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.దేశంలో ప్రతి రోజూ కొన్ని లక్షలాది మంది ప్రజలు రైల్వే మార్గం గుండానే పయనిస్తారు.
ధర తక్కువ, సౌకర్యం ఎక్కువ కలిగిన వ్యవస్థలలో రైల్వే వ్యవస్థ ముందంజలో ఉంటుంది.ఈ క్రమంలోనే భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను ప్రారంభించింది.సదరు ప్రయోజనాలను పొందడం ద్వారా మీరు వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

ఇపుడు శీతాకాలం కావడంతో పొగమంచు కారణంగా రైళ్లు కాస్త ఆలస్యమవుతున్నాయి.దీని కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.చలికాలంలో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, రైలు 2, 4 లేదా కొన్నిసార్లు 8 గంటలు కూడా ఆలస్యం కావచ్చనే విషయం ప్రయాణికులు తెలుసు.అలాంటి పరిస్థితిలో కొంతమంది హోటల్‌లో ఖరీదైన గదిని బుక్ చేసుకుంటారు.
కానీ చాలా మంది అదే స్టేషన్‌లో చల్లని గాలిలో రైలు కోసం వేచి ఉంటారు.అయితే, మీరు కూడా రైల్వే రిటైరింగ్ గదిని సద్వినియోగం చేసుకోవచ్చు.

దీని కోసం PNR నంబర్ అవసరం అని గుర్తు పెట్టుకోండి.అత్యంత తక్కువ ఛార్జీతోనే మీరు 48 గంటల పాటు గదిలో రెస్ట్ తీసుకోవచ్చు.దీని కోసం మీ నుంచి కేవలం రూ.20 నుంచి రూ.40 వరకు మాత్రమే చార్జీ తీసుకుంటారు.వాస్తవానికి, దీని కోసం మీరు PNR నంబర్‌ను కలిగి ఉండాలి.
ఇక పెద్ద పెద్ద స్టేషన్లలో అయితే AC , నాన్ AC గదులను కూడా పొందుతారు.దీన్ని బుక్ చేసుకోవడానికి.మీరు వెబ్‌సైట్‌లో ని సందర్శించాలి.గుర్తుంచుకోండి! టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన లేదా RAC ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.







