2023 సంవత్సరం ఆ నలుగురు యంగ్‌ హీరోలకు చాలా కీలకం

టాలీవుడ్ యంగ్ హీరోలు తమ తమ కెరీర్‌ లో కష్టాల కడలి ఈదుతున్నారు.ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మెగా హీరో సాయిధరమ్ తేజ్, రామ్ మరియు నితిన్ ల యొక్క కెరియర్ కాస్త గందరగోళంగా ఉంది అనడంలో సందేహం లేదు.

 Tollywood Young Heroes Ram Vijay Devarakonda Nitin And Sai Dharam Tej Facing Fai-TeluguStop.com

గత సంవత్సరం వీరికి నిరాశ మిగిలింది.రామ్ యొక్క ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే.

ఆ సినిమా తో కచ్చితంగా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తానంటూ హామీ ఇచ్చిన రామ్ చివరకు ప్రేక్షకులు ఇదేం సినిమా అనుకునేట్లు చేశాడు.ఇక నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

Telugu Liger, Nitin, Republic, Sai Dharam Tej, Warrior, Tollywoodyoung-Movie

నితిన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్న ఆ సినిమా కి మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు.ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన సినిమా లైగర్‌ దారుణమైన పరాజయాన్ని మూట కటుకుంది.

లైగర్ కోసం విజయ్ దేవరకొండ దాదాపు రెండున్నర సంవత్సరాల కేటాయించాడు.అయినా కూడా ఆ సినిమా నిరాశే మిగిల్చింది.

ఇక మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ రిపబ్లిక్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సినిమాలను చేయలేదు.ఎప్పుడెప్పుడు వస్తుందంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఆయన ఈసారి ఎలాగైనా హిట్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.మొత్తానికి ఈ యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.2023 సంవత్సరం వారికి కలిసి వస్తుందా అనేది చూడాలి.ఈ యంగ్ హీరోలు మాత్రమే కాకుండా మరి కొందరు యంగ్ హీరోలు కూడా గత ఏడాది సక్సెస్ అవ్వలేక పోయారు.

మరి వారు ఈ ఏడాదిలో అయినా సక్సెస్ లను తమ ఖాతాలో వేసుకుటారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube