గుంటూరు జిల్లా తాడేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ నేత నారా లోకేశ్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో తీవ్ర కలకలం చెలరేగింది.
నారా లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని టీడీపీ నేతలు తాడేపల్లిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







