రేపు కొండగట్టుకు జనసేనాని పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ ఖరారైంది.ఇందులో భాగంగా రేపు కొండగట్టు అంజన్న ఆలయానికి ఆయన చేరుకోనున్నారు.

 Jana Sena's Pawan Kalyan To Kondagattu Tomorrow-TeluguStop.com

అనంతరం ఎన్నికల ప్రచారం రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ప్రత్యేక పూజలు అనంతరం నాచుపల్లికి జనసేనాని చేరుకోనున్నారు.

అక్కడ ఓ రిసార్ట్ లో పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం కానున్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

అనంతరం సాయంత్రం నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.మొత్తం 32 నారసింహ క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube