మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోగా ఈ సినిమా అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు భారీ లాభాలను అందించింది.నేను డైరెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తానని చిరంజీవి తెలిపారు.
ఒక బ్రెయిన్ కంటే రెండు బ్రెయిన్స్ గొప్ప అని నేను అనుకుంటానని మెగాస్టార్ అన్నారు.ఒకరికి తట్టని ఆలోచనలు మరొకరికి తడతాయని చిరంజీవి కామెంట్లు చేశారు.

సినిమా అందరికీ నచ్చాలని నేను భావిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.చరణ్ స్టార్ హీరో కావడం గురించి చిరంజీవి స్పందిస్తూ నా పిల్లలు సినిమాల్లోకి రావాలని నేను బలవంతంగా రుద్దలేదని ఆయన తెలిపారు.చరణ్ సినిమాల్లోకి రావడంతో పాటు యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడని ఆ కష్టం వల్లే చరణ్ ఈ స్థాయికి వచ్చాడని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.చరణ్ ప్రాజెక్ట్ లు మంచి సక్సెస్ సాధిస్తాయని భావిస్తున్నానని ఆయన తెలిపారు.

చరిత్రకు సంబంధించిన సినిమాలను తెరకెక్కించే సమయంలో కొంత ఫిక్షన్ ను యాడ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి పేర్కొన్నారు.చరణ్ యాక్టర్ గా తనకు ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటాడో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తే సినిమాకు పని చేసే అందరికీ ఒకే తరహా సౌకర్యాలు ఇవ్వాలని భావిస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు.చరణ్ డబ్బు కంటే కంఫర్ట్ కే ప్రాధాన్యత ఇస్తాడని మెగాస్టార్ తెలిపారు.
మా నాన్న పోలీస్ ఆఫీసర్ అని రామ్ చరణ్ నాన్న మెగాస్టార్ అని ఆ భరోసా చరణ్ ను ఏమైనా చేయిస్తుందని చిరంజీవి వెల్లడించారు.
చిరంజీవి బాబీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద హిట్ కాంబినేషన్ అనిపించుకుంది.కథ రొటీన్ గానే ఉన్నా ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడం గమనార్హం.







