ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంటిలోకి ఓ డిప్యూటీ తహశీల్దార్ అర్ధరాత్రి చొరబడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఉద్యోగం విషయం మాట్లాడాలి అంటూ డిప్యూటీ తహశీల్దార్ ఆమె నివాసంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని చూసిన స్మితా సబర్వాల్ అరవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.ఆ వెంటనే ఆనంద్ తో పాటు మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఘటనపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఓ ట్వీట్ చేశారు.
ఆ రోజు భయమేసిందని, రాత్రి సమయాల్లో డోర్ లాక్స్ ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని ప్రజలకు సూచించారు.అవసరమైతే డయల్ 100 కు కాల్ చేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.







