హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ఉపాధ్యాయ దంపతులు మౌన దీక్ష చేపట్టారు.13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీల కోసం దీక్షకు దిగారు.పిల్లలతో కలిసి ప్లకార్డులు, జెండాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు.నరకం అనుభవిస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోతున్నారు.615 మందికే అవకాశం ఇచ్చారని, మిగతా వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అందరికీ అవకాశం ఉన్నా బదిలీలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఇప్పటికైనా ఈ అంశంపై సీఎం కేసీఆర్ కల్పించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.అయితే రోడ్డుపై వందలాది ఉపాధ్యాయ దంపతులు నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







