దక్షిణాధిన పాగా వేయాలని.బీజేపీ అధిష్టానం చాలా కాలం నుంచి అనుకుంటూ ఉంది.
దానికి తెలంగాణ ను అడ్డాగా చేసుకోవాలని ప్లాన్ చేసారు.అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం నుంచి నెలకు ఒకరు చొప్పున రాష్ట్రం లో పర్యటించడానికి అధిష్టానం షెడ్యూల్ రెడీ చేస్తోంది.
మొన్న ఢిల్లీ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయం పై నేతలు చర్చించారు. బండి సంజయ్ ను ప్రధాని ప్రత్యేకంగా అభినందిస్తూ.
ముందు ముందు చేయాల్సిన కార్య క్రమాలు పై దిశా నిర్దేశం చేశారు.అంతే కాకుండా జాతీయ స్థాయిలో యువ మోర్చా నించి నేతలను తెలంగాణ కు పంపాలని.
ఏకంగా ప్రధాని సూచించారు.
ఇక సమావేశాలు ముగిసిన మూడు రోజులకు బీజేపీ ప్లాన్ స్టార్ట్ అయింది.
కేవలం 15 రోజుల వ్యవధి లోనే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ లో పర్యటించ డానికి రెడీ అయ్యారు.
ఫిబ్రవరి లో ఇద్దరి నేతల పర్యటనల షెడ్యూల్ నీ పార్టీ ఫైనల్ చేసింది.

జాతీయ స్థాయిలో చక్రం తిప్పుత అంటున్న సీఎం కెసిఆర్ కు కూడా.ఇక్కడే చెక్ పెట్టాలని చూస్తున్నారు.అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ ఈ సారి.
టార్గెట్ నీ 90 కి ఫిక్స్ చేసింది.ప్రతి జిల్లా లోనూ.
కేడర్ ఉన్న నేతలను పార్టీ లోకి తీసుకొని.హామీలు ఇవ్వాలని సైతం చెప్పేసింది.
దాంతో అటు ఈటెల యక్టివ్ అయ్యారు.పాత పరిచయాలను మళ్లీ తిరగ తోడుతు ఉన్నారు.

నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డీ రాజగోపాల్ రెడ్డి నీ తీసుకున్న బీజేపీ.ఇప్పుడు ఖమ్మం పై ఫోకస్ పెట్టింది.అక్కడ కేడర్ ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ ఆహ్వానించింది.ఇక ఆయనకు ఎంపీ సీటు కూడా ఆఫర్ చేసి నట్టు తెలుస్తోంది.అయన అనుచరుల్లో ఒకరికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వబోతున్నారు.ఇలా మొత్తానికి కమలం నేతలు ప్రతి జిల్లా పై ఫోకస్ పెట్టీ.
పాగా కు ప్లాన్ చేశారు.







