హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలతో మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రపై చర్చిస్తున్నారు.
జనవరి 30 వరకు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో 30 తర్వాత హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించాలనే యోచిస్తున్నారు.అంతకముందు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ముఖ్యనేతలతో ఠాక్రే సమావేశం అయ్యారు.
కాగా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.







