ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది.దాదాపు పదకొండు ఏళ్లుగా లాయర్లుగా చెలామణీ అవుతున్నారు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో నకిలీ న్యాయవాదులపై కేసులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో మొత్తం 15 మంది నకిలీ లాయర్లను బార్ కౌన్సిల్ గుర్తించింది.వీరిలో ఎనిమిది మంది న్యాయవాదులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి తమ పేరును ఉపసంహరించుకున్నారు.
మరో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.