ఈ మధ్య కాలంలో ఎక్కువ గా దేవాలయాలలోనే దొంగతనాలు జరుగుతున్నాయి.దొంగలు భగవంతుని సన్నిధిలోనే దొంగతనం చేయడం కలకలం రేపుతుంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన టెక్సాస్ లోని ఒక హిందూ దేవాలయంలో భారీ దొంగతనం జరిగింది.గుర్తు తెలియని దుండగులు నేరుగా దేవాలయంలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులను దాచుకునే లాకర్ల ను ఎత్తుకు వెళ్లారు.
ఈ ఘటన జరగడం వల్ల భారత కమ్యూనిటీ షాక్ కు గురైంది.బ్రాజోస్ వ్యాలీ లో ఉన్న ఒకే ఒక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్ దేవాలయం.
ఈ దేవాలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.బోర్డు మెంబర్ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం కిటికీ తొలగించి ఆలయం లోనికి చొరబడిన దొంగలు హుండీ తో పాటు కొన్ని విలువైన వస్తువులను దచే లాకర్ ను చోరీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

అయితే దేవాలయ అర్చకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తుందని వాళ్లంతా సురక్షితం గానే ఉన్నారని బోర్డు మెంబర్ శ్రీనివాస సుంకరి తెలిపారు.ఇంకా చెప్పాలంటే సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నమోదయిందని ఆయన వెల్లడించారు.

ఆదివారం హిందూ కమ్యూనిటీ తో సమావేశమై ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు.అంతే కాకుండా ఈ ఘటన పై మన భారత దేశ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు వేగంగా విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.







