సంక్రాంతి 2023 కి రొటీన్ కథలతో అటు కోలీవుడ్ ఇది టాలీవుడ్ రెండు కూడా నిండిపోయింది.హీరో బేసిక్ మూవీ రొటీన్ కథ అయినప్పటికీ కోట్లకు కోట్లు బాక్సాఫీస్ వద్ద కాసుల కురిసాయి.
చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు కూడా తెలుగులో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతున్నాయి.కోలీవుడ్లో విజయ్ వారీసు, అజిత్ తునివు కూడా అదే సార్లు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయనే చెప్పుకోవాలి.
మరి హీరో కోసమే కథ రాసినట్టుగా రాయడంతో వారి వారి ఫ్యాన్స్ ఆ సినిమాను విజయవంతం చేయడానికి బాగా ఈజీ అయ్యిందని చెప్పుకోవచ్చు.

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య విషయానికొస్తే ఆ వింటేజ్ లుక్స్, కొంతమేర కామెడీ అలాగే మేనరిజమ్స్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.ఈ సినిమా విజయం సాధించడంలో రవితేజ కూడా మంచి రోల్ పోషించాడు అని చెప్పాలి. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు.
ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ తీస్తేనే హీరోలకి భారీ కలెక్షన్స్ వస్తాయి అని మరోసారి ప్రూవ్ అయింది.ఇక బాలకృష్ణ సైతం 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉండడం విశేషం.
ఈ సినిమాలో అక్కడక్కడా సెంటిమెంట్ సీన్స్ అలాగే చిన్న చిన్న అడ్వెస్టులు ఎలివేషన్స్ వీరసింహారెడ్డి విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అలాగే తెలుగు నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా విజయ్ హీరోగా వచ్చిన వారసుడు.ఈ సినిమా అయితే దారుణమైన రొటీన్ కథ అయినప్పటికీ కూడా మొదటిసారి విజయ్ ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి ఈ సినిమాకు తమిళ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించారు.

ఇక హీరో అజిత్ సినిమా తెగింపు కూడా దాదాపు పాత కథ.రాబరీ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా వచ్చినప్పటికీ ఈ జనాలను ఆకట్టుకోలేకపోయింది అయినా కూడా సంక్రాంతి బరిలో ఈ సినిమా వసూళ్లు కురిపించడం విశేషం అనే చెప్పాలి.







