ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. వీటిని కూడా కన్సిడర్ చేయండి అంటూ పోస్ట్?

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆస్కార్డ్ అవార్డ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 Ntr For Oscars Trend In Social Media , Ntr, Rrr, Oscars, Social Media, Tollywood-TeluguStop.com

కాగా మార్చి నెలలో ఈ ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం అకాడమీ సభ్యులు ఆస్కార్ కీ అన్ని విభాగాల లోను షార్ట్ లిస్టు చేసే పనిలో ఉన్నారు.

ఈసారి ఆస్కార్ అవార్డ్స్ ఇండియా వాళ్లకి మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు.ఎందుకంటే ఈసారి కచ్చితంగా ఏదో ఒక విభాగంలో ఆస్కార్ ఇండియాకి వస్తుంది అని ఆర్ఆర్ఆర్ సినిమా మీద నమ్మకంతో ఉన్నారు సినిమా ప్రేక్షకులు.

Telugu Mia Goth Pearl, Nina Hoss Tar, Oscars, Tollywood-Movie

మరోవైపు రాజమౌళి కూడా అమెరికాలో ఉంటూ ఆస్కార్ టార్గెట్గా పెట్టుకొని ఆర్ఆర్ఆర్ సినిమాను విపరీతంగా హాలీవుడ్లో ప్రచారాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అలాగే హాలీవుడ్లో పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో ఎలా అయినా ఆస్కార్ లో స్థానం సాధిస్తామని నమ్మకంతో రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.దానితో టాలీవుడ్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాకు తప్పకుండా ఆస్కార్ రావాలి అని గట్టిగా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంతమంది ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Telugu Mia Goth Pearl, Nina Hoss Tar, Oscars, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా హాలివుడ్ ఫేమస్ న్యూస్ సైట్ యూఎస్ఎ ఓ పదిమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ల పేర్లని సజెస్ట్ చేస్తూ ఆస్కార్ సభ్యులు ఈ పదిమందిని కచ్చితంగా కన్సిడర్ చేయాలి అంటూ పోస్ట్ చేసింది.ఈ పదిమందిలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కూడా ఉండటంతో ఇక్కడి అభిమానులు ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.యూఎస్ఏ టుడే సజెస్ట్ చేసిన పది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవే.ఎన్టీఆర్ – ఆర్ఆర్ఆర్, టామ్ క్రూజ్ – టాప్ గన్ మెవరిక్, పాల్ దానో – ది బ్యాట్ మ్యాన్, మియా గోత్ – పెరల్, నినా హోస్ – తార్, జో క్రావిట్జ్ – కిమీ, లశ్చన లించ్ – ది ఉమెన్ కింగ్, పాల్ మెస్కెల్ – ఆఫ్టర్ సన్, కేకే పామర్ – నోప్, జెరెమీ పాప్ – ది ఇన్స్పెక్షన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube