ఇలియానాకు మరోసారి టాలీవుడ్‌ నుండి పిలుపు అందిందా?

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్‌ హీరోయిన్స్ లో మొదటి కోటి రూపాయల పారితోషికం దక్కించుకున్న హీరోయిన్‌ గా ఎప్పటికి ఇలియానా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.

 Ileana Tollywood Re Entry News , Ileana , Ileana Telugu Film ,ravi Teja ,bollywo-TeluguStop.com

హీరోయిన్ గా ఇలియానా యొక్క జోరు ఒకానొక సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ ను కూడా ఆశ్చర్యరపర్చింది.కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త ఇబ్బందిగా కష్టంగా ఉంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.బాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గిన సమయంలో కూడా టాలీవుడ్‌ లో రీ ఎంట్రీకి ఆమె ఆసక్తి చూపించలేదు.

అక్కడ పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగితేనే టాలీవుడ్‌ లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇలియానా ఇటీవల ఒక తెలుగు సినిమా కు కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.కానీ ఒక సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం జరిగిందని.

చాలా రోజుల తర్వాత ఇలియానా ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆ మధ్య రవితేజ కు జోడీగా ఈమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది.

అందుకే ఈ సినిమా అయినా ఆమెను మళ్లీ తెలుగు లో బిజీ చేసేనా అనేది చూడాలి.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఇలియానా యొక్క తెలుగు సినిమా విశేషాలు అతి త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.ఇలియానా యొక్క బాలీవుడ్‌ కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.అందుకే ఇటు వైపు ఈ గోవా బ్యూటీ చూస్తోంది.

ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి.ఇలియానా కనుక మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయితే కచ్చితంగా అధ్బుతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube