సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.హెయిర్ ఫాల్ అధికంగా వేధించడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం.
ఈ రెండు పల్చటి జుట్టుకు ప్రధాన కారణాలు.అయితే కారణం ఏదైనప్పటికీ పల్చటి జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
వారంలో రెండు సార్లు కనుక ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ గ్యాప్ ధరించాలి.కనీసం రెండు గంటల పాటు ఈ హెయిర్ ప్యాక్ ను ఉంచుకోవాలి.
అనంతరం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.హెయిర్ ఫాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.దాంతో పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది.
కాబట్టి పల్చటి జుట్టు సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.







