ఒక రోజు రాంగోపాల్ వర్మ నిద్రలో ఉండగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది.భీమవరం నుంచి బుజ్జి అనే తన స్నేహితుడు వర్మ కి కాల్ చేశాడు.
చిరాకుగా ఇంత పొద్దున్నే బుజ్జి ఎందుకు కాల్ చేసాడు అని కోపంతోనే తిరిగి కాల్ చేశాడు.చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అవతల పైపు నుంచి ఒక ప్రశ్న వచ్చింది.
ఎవరైనా ఉంటే బయటకు వచ్చి ఫోన్ చెయ్ అని చెప్పి పెట్టేశాడు బుజ్జి.తను బయటకు వచ్చి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి బుజ్జి కి ఫోన్ చేయగా మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది అయన చనిపోయారు.
మీరందరూ ఇక్కడికి వస్తారా లేదా బాడీని అక్కడికి తీసుకు రమ్మంటారా అని బుజ్జి చెప్పాడు.

దాంతో నాన్న శవాన్ని హైదరాబాద్ కి తీసుకు రమ్మని చెప్పి వెంటనే వర్మ ఫోన్ పెట్టేసాడు.ఆ టైంలో చుట్టాలకు కొందరికి బయట నుంచి ఫోన్ చేసి మా నాన్న చనిపోయారు.మీరెవరు ఇప్పుడే మా ఇంటికి రావద్దు మా అమ్మకి ఈ విషయం చెప్పాలి అని విషయాన్నీ చెప్పాడు.
ఆ తర్వాత ఇంటికి వచ్చి అమ్మతో ఒకే సారి నాన్న చనిపోయిన విషయం చెబితే తట్టుకోలేదు అని అప్పటికప్పుడే ఒక ఫ్రెండ్ తో ఫోన్ లో ఒక డ్రామా చేశాడు.నాన్నకి అప్పుడే గుండెపోటు వచ్చి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు చెప్పాడు.
వస్తూ వస్తూ ఉండగానే గుండెల్లో నొప్పి పెరిగిపోయి హైదరాబాద్ వచ్చేసరికి నాన్న చనిపోయినట్టు చెప్పాలని అనుకున్నాడు.

కాని బాడీని తీసుకొని హైదరాబాద్ వచ్చేసరికి రాత్రి సమయం కావడంతో తెల్లవారే దాకా తల్లి తండ్రి శవం దగ్గర ఏడుస్తూ ఉండాల్సి వస్తుందని, కారును వెనక్కి తిప్పి తన ఫ్రెండ్ ఇంటికి పంపించాడు.తెల్లవారి శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చేలోపే తన తాత వాళ్ళ అమ్మకి వర్మ తండ్రి చనిపోయిన విషయం చెప్పారు.ఆ తర్వాత తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం తన కళ్ళని దానం చేసి దహన సంస్కారాలు చేసి తెల్లవారి షూటింగ్ కి వెళ్ళిపోయాడు వర్మ.
కానీ అందరి లాగ మూడవ రోజు, చిన్న కర్మ అంటూ చేయద్దని, కేవలం నాన్న జ్ఞాపకాలను మనలో ఉంచుకుందాం అని చెప్పగానే వర్మ తల్లి బోరున ఏడ్చింది.దాంతో ఆమె ఏడుపు చూడలేక కర్మ జరిపించాడు వర్మ.







