టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇక సినిమా లోని నాటు నాటు సాంగ్ అంతర్జాతీయ వేదిక లపై మన ఇండియన్ సినిమా కు అవార్డుల పంట పండిస్తోంది.
అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును తెచ్చి పెట్టిన నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ప్రముఖ హాలీవుడ్ సినీ విశ్లేషకుడు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.పాటల విషయం లో హాలీవుడ్ సినిమా లతో పోలిస్తే ఇండియన్ సినిమా లకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను సొంతం చేసుకుంది.
అక్కడ సత్తా చాటిన నాటు నాటుకు ప్రమోషన్ కార్యక్రమాలను మెండుగా చేస్తే కచ్చితంగా ఆస్కార్ రేసులో ఈ పాట నిలిచే అవకాశం ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ చిత్రం మరియు వీఎఫ్ఎక్స్ ఇతర కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్స్ సొంతం అయ్యే అవకాశం కాస్త తక్కువే అయినా కూడా ఖచ్చితంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మాత్రం ఆస్కార్ నామినేషన్స్ సొంతం చేసుకునేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
రాజమౌళి సారధ్యం లో కీరవాణి సంగీతం సమకూర్చిన నాటు నాటు పాటలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నర్తించిన విషయం తెలిసిందే.ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.పాట కోసం రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించాడు.
ఈ పాట మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తోంది.కనుక ఆస్కార్ అవార్డు సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతో నమ్మకం తో ఎదురు చూస్తున్నాడు.