హీరో వెంకటేష్ రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండేవాడు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.
ఆయన సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఏమీ లేవు.శైలేష్ కొలను దర్శకత్వం లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయంలో ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు.ఇదే సమయంలో రానా కూడా సినిమాలతో పెద్దగా సందడి చేయడం లేదు.
ఆయన తోటి యంగ్ హీరోలు వరుసగా సినిమా లు చేస్తున్నారు.ఆయన మాత్రం కొత్త సినిమాలను తీసుకు వచ్చే విషయంలో.
ఎంపిక చేసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడు.అందుకే దగ్గుబాటి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దగ్గుబాటి హీరోలు ఇలా వ్యవహరించడంను చాలా మంది తప్పుబడుతున్నారు.ఈ బాబాయి మరియు అబ్బాయి కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ను చేసిన విషయం తెల్సిందే.

ఆ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అప్‌డేట్ రాలేదు.అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.ఎట్టకేలకు వెంకీ మరియు రానా వెబ్ సిరీస్ వస్తుందని ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ వారి ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.కానీ షూటింగ్ పూర్తి అయ్యిందని చెప్పి కూడా చాలా నెలలు అవుతుంది.
కానీ ఇప్పటి వరకు స్ట్రీమింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ వారు ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.వెంకటేష్ మరియు రానా లు కలిసి సినిమాల్లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కలిసి మల్టీ స్టారర్ ఏమో కానీ కనీసం సోలో హీరోలుగా వీరు సినిమాలు చేయడం లేదు బాబోయ్ అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తో ఊగి పోతున్నారు.ముందు ముందు ఫ్యాన్స్ మరింతగా సోషల్ మీడియాలో రచ్చ చేయక ముందే ఈ బాబాయి అబ్బాయి వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







