చైనా తర్వాత అమెరికా నుంచే భారతదేశానికి ముప్పు.. భారతీయుల సర్వేలో..

మన భారతదేశానికి సరిహద్దు దేశాల నుంచి చాలావరకు చైనా నుంచే ముప్పు పొంచి ఉందని దాదాపు చాలామందికి తెలుసు.చైనా నుంచి అతి పెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడింది.

 After China, The Threat To India Comes From America.. According To The Survey O-TeluguStop.com

అంతేకాకుండా ఆ తర్వాత స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు.కానీ రెండవ స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఒక సర్వేలో వెల్లడించారు.

అమెరికాకు చెందిన గ్లోబల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రతి 1,000 మందిలో 43 శాతం మంది చైనా నుంచి మిలిటరీ ముప్పు పొంచి ఉందని భావిస్తుంటే, 22 శాతం మంది అమెరికా నుంచి ముప్పు ఉందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ సర్వేను గత సంవత్సరం అక్టోబర్లో చేశారు.

Telugu America, Chaina, China, India, Indians, International, Pakistan-National

2020 నుంచి భారత్,చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సరిహద్దు వివాదం కూడా ఉందని చైనా నుంచే భారతదేశానికి ఎక్కువ సైనిక ముప్పు ఉందని సర్వేలు చెబుతున్నాయి.అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగ్య సాములుగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా, చైనాల మధ్య ఘర్షణ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని ప్రాంతీయ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భారతీయులు భావిస్తున్నారు.

Telugu America, Chaina, China, India, Indians, International, Pakistan-National

డ్రాగన్ కంట్రీ అయినా చైనా ను అడ్డుకునేందుకు క్వార్డులో యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్తో, ఇండియా సభ్య దేశంగా ఉంది.అయినప్పటికీ వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని భారతీయులు అభిప్రాయపడుతున్నారు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ స్థిరంగా ఉంది.రష్యాతో అన్ని వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ ఉంది.డిస్కౌంట్ పై ముడి చమరు కొనుగోలు చేస్తూనే వస్తోంది.అయితే ఇదే సమయంలో భారత్ కొన్ని దేశాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉంటే 66% నుంచి భారత ఆయిల్ కొనుగోలు చేయాలని తెలుపగా, 48% రష్యా భారతదేశానికి ముఖ్యమైన సైనిక పరీకరాల భాగ్యస్వామిగా ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.యూఎస్ఏ తో పోల్చుకుంటే రష్యా తోనే భారతీయుల సంబంధాలు బలంగా ఉన్నాయని మన దేశ ప్రజలు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube