ప్రతిపక్షాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్

ప్రతిపక్షాలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.తమ పార్టీ డీఎన్ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారన్నారు.

 Ap Government Adviser On Opposition Sajjala Fire-TeluguStop.com

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు.అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.

ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏనాడూ సంక్షేమ పథకాలు ఆగలేదని సజ్జల తెలిపారు.సీఎం జగన్ బలహీన వర్గాలకు విద్య, వైద్యాన్ని చేరువ చేశారని కొనియాడారు.

అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.జగన్ ను అధికారంలో కొనసాగించడం బలహీన వర్గాలకు అవసరమన్న సజ్జల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube