నందమూరి బాలకృష్ణ 2021 సంవత్సరం డిసెంబర్ లో అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కు దాదాపుగా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆ సమయంలో ప్రకటించారు.
కానీ బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం సినిమా 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది అనేది టాక్.ఆ విషయం పక్కన పెడితే తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ఏ మేరకు కలెక్షన్స్ ను రాబట్టింది అనేది క్లారిటీ రావడం లేదు.
లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు క్రాస్ చేయడం కన్ఫర్మ్ అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.కానీ అఖండ స్తాయి లో వసూళ్లు నమోదు చేస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
అఖండ సినిమా విడుదల సమయంలో పోటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ స్థాయి లో కలెక్షన్స్ వచ్చాయి.

కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు అంటూ బాక్సాఫీస్ రిపోర్ట్ వినిపిస్తుంది.వీర సింహా రెడ్డి సినిమా యొక్క కలెక్షన్స్ ప్రస్తుతానికి బాగానే ఉన్నా ఈ సంక్రాంతి సీజన్ పూర్తి అయిన వెంటనే సినిమా కు వసూళ్లు డౌన్ అయ్యే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.
రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను వీర సింహారెడ్డి దక్కించుకుంటుందని అంతా భావించారు.కానీ అంత సీన్ లేదు అని తేలిపోయింది.ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా పోటీ ఉండగా ముందు ముందు మరిన్ని సినిమాలు పోటీగా వచ్చే అవకాశ ఉంది.కనుక అఖండ స్థాయిలో వీర సింహారెడ్డి సినిమా వసూళ్లు నమోదు చేయడం అసాధ్యంగా తెలుస్తోంది.
ఏమైనా అద్భుతం జరిగేనా చూడాలి.








