జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా తిప్పన్నపేట్, తిమ్మాపూర్ లో గ్రామ సభలు నిర్వహించారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
మరోవైపు తిమ్మాపూర్ గ్రామ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్ధతు తెలిపారు.
బాధిత రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు.అయితే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని బాధిత రైతులు స్పష్టం చేశారు.







