తెలుగు ప్రేక్షకులకు మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.
ఇక మెగా ఫ్యామిలీ ఇంట ఎప్పుడు సంతోషకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు.అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుంచి తరచుగా ఏదో ఒక శుభవార్తలను మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వినిపిస్తూనే ఉంటారు.
అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే ఇటీ ఇవ్వలే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పడంతో అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో సంతోషాలు అంబరాన్ని అంటుతున్నాయి.
మెగా వారసుడు కోసం చిరంజీవి మెగా ఫ్యామిలీతో పాటుగా మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ కూడా తన భార్యతో కలిసి టూరిస్ట్ ప్లేస్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.ఇకపోతే రామ్ చరణ్ కి కొడుకు పుట్టాలని తనకు మేనల్లుడు పుడితే బాగుంటుంది అని ఇటీవల వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత తెలిపిన విషయం తెలిసిందే.

ఇక మెగా అభిమానులు గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత రామ్ చరణ్ తండ్రి ఏ నెలలో కాబోతున్నాడు అన్న విషయాన్ని అంచనా వేస్తున్నారు.రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు అవుతున్న విషయం తెలిసి మా ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించింది మాకు ఈ శుభవార్త చాలా ఎమోషనల్ గా మారింది.అని మెగాస్టార్ చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఆగస్టులో లేదంటే జూలైలో మెగా వారసుడు రాబోతున్నాడు.

ఆగస్టు లేదా జూలైలో మెగా వారసుడు రాబోతున్నాడని ఆ శుభవార్త అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే తాను పుట్టిన నెల ఆగస్టు కాబట్టి ఆగస్టు అయితే ఇంకా బాగుంటుందని, ఆగస్టు కి ఒక నెల అటు ఇటుగా ఉండొచ్చు ఏ నెలలో అయినా డెలివరీ అయినా, ఏది ఏమైనా మా ఇంట్లో ప్రస్తుతం ఆనందకరమైన వాతావరణము ఉంటుంది అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు వారసుడు రాబోతున్నాడు అన్న ఆనందం మరోవైపు మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడంతో రెండు ఆనందాలను పొందుతున్నాడు.







