మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సంక్రాంతి సీజన్ బాగానే కలిసి వచ్చి వాల్తేరు వీరయ్య కు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
ఇక ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించడం వల్ల ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపించారు అనడంలో సందేహం లేదు.
భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా కు రవితేజ అదనపు ఆకర్షణగా నిలిచాడు అనడం లో ఏమాత్రం సందేహం లేదు.
సంక్రాంతి సీజన్ లో వాల్తేరు వీరయ్య యొక్క జోరు కొనసాగుతూనే ఉంది.రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా లో రవితేజ ఉండడం వల్లే బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య కు ఏమాత్రం తగ్గకుండా రవి తేజ పాత్ర కూడా ఉండడంతో సినిమా కు అదనపు ఆకర్షణ అన్నట్లుగా నిలిచింది.

రవితేజ గత చిత్రం ధమాకా విజయం సాధించిన నేపథ్యం లో వాల్తేరు వీరయ్య సినిమా కు కూడా ఆ సక్సెస్ కలిసి వచ్చింది.ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమా ల తర్వాత రవితేజ చేస్తున్న సినిమా రావణాసుర.ఈ సినిమా ఇదే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

మరో వైపు ప్రేక్షకులంతా కూడా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే.మొత్తానికి రవితేజ ఈ ఏడాది మొత్తం బిజీ బిజీగా ఉంటూనే సక్సెస్ ఫుల్ కెరీర్ ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.







