మలయాళం లో ప్రస్తుతం స్టార్ హీరోగా మరియు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న నటుడిగా దుల్కర్ సల్మాన్ నిలిచాడు.నిన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ తో పాటు యావత్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు.
తండ్రి మమ్ముట్టి ఇప్పటికీ మంచి హీరో గానే కొనసాగుతున్నాడు 50 ఏళ్లకు పైగా నటుడిగా ఉన్నప్పటికీ కొడుకు నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడంటే మామూలు విషయం కాదు.మరి నెంబర్ వన్ స్థానానికి రావడానికి కేవలం దుల్కర్ కి పదేళ్ల సమయం మాత్రమే పట్టింది.
ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఇది 2023లోనే విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ దుల్కర్ సల్మాన్ అంచలంచలుగా ఎదుగుతున్నాడు.ఇక ప్రతి సినిమాకి కొత్తగా పుడుతున్నాడా అనే అనుమానం వచ్చే విధంగా అతడు పలికించే ఎక్స్ప్రెషన్స్, అతడి అందం దుల్కర్ కి అభిమానులను అంతకంతకు పెంచుతూ వెళ్తోంది.దుల్కర్ కి అందంతో పాటు నటన కూడా తన తండ్రి నుంచే వారసత్వంగా వచ్చింది.నిజానికి మమ్ముట్టికి కొడుకు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు.సినిమా ఇండస్ట్రీలో పూల బాట ఉండదు అనేది మమ్ముట్టి అభిప్రాయం.ఎంట్రీ దొరికినంత మాత్రాన స్టార్డం వస్తుందా అంటే అనుమానమే.
అందుకే దుల్కర్ నీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలనుకున్నాడు మమ్ముట్టి.

మొదట దుల్కర్ నీ చదువు అవగానే దుబాయ్ కి ఉద్యోగం కోసం పంపించేశాడు.ఆ తర్వాత దుల్కర్ లో ఉన్న నటుడు నిద్రపోలేదు మెల్లిగా ఇండస్ట్రీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.నటుడిగా అవతారం ఎత్తి సినిమాల్లో పాటలు కూడా పాడేవాడు.
ఆ తర్వాత నిర్మాతగా కూడా మారాడు దుల్కర్ సల్మాన్.ఇక ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ అనే సంస్థ చేసిన సర్వేలో సౌత్ లో మరి ముఖ్యంగా మలయాళంలో దుల్కర్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
ఇక సీతా రామం సినిమా తర్వాత దుల్కర్ కి లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది
.






