గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆయన పచ్చ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.మరోవైపు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.అయితే వైసీపీలో ఉన్న శ్రీనివాసరావు గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
వైసీపీలో సముచిత స్థానం లభించకపోవడంతోనే ఆయన పార్టీ మారుతున్నట్లు సమాచారం.







