విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు ప్రజల అభిమాన నటుడిగా ,అందరు ఆదరిస్తారు .ఆయనను పురాణ పురుషుడిగా .
రాముడు గా ,కృష్ణుడు గా ,భీష్ముడు గా ,దుర్యోధనుడు గా , రావణ భ్రమ్మగా తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ని ఒక దేవుడిగా ఆరాధించేవారు .పౌరాణిక ,సాంఘిక ,జానపద చిత్రాల్లో ఏ పాత్రలోనైన ఆయన జీవించేవారు , ఆ పాత్రలు అయన కోసమే పుట్టినట్టు గా ఉండేవి .ఇక అలాంటి యుగ పురుషుడిని మనము ఈ రోజున మరొక్క సారి గుర్తు చేసుకుందాం .ఎన్టీఆర్ 28 మే 1923 న లక్ష్మయ్య వెంకట రావమ్మ దంపతులకు జన్మించారు .అయన స్వగ్రామం నిమ్మకూరు కృష్ణ జిల్లా ఆంధ్ర ప్రదేష్ .అయన తల్లి తండ్రులు ముందుగా కృష్ణ అనే పేరును నామకరణం చేద్దాం అని అనుకున్నారు , కానీ అయన మేనమామ తారక రాముడు అనే పేరు అయితే బాగుటుంది అని సూచించారు , చివరికి ఆ పేరు కాస్త తారక రామారావుగా మారింది.
ఆయన బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు , పెద్ద బాల శిక్ష అభ్యసించారు , సాంప్రదాయ పద్ధతులకు ఎక్కువ గా మక్కువ చూపించేవారు విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాల లో విద్య ను అభ్యసించారు ,ఆ తరువాత పై చదువుల కోసం ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ లో చదువుకున్నారు .ఎన్టీఆర్1947 లో పట్టభద్రులయ్యారు ,ఆ తరువాత మద్రాస్ లో సర్వీస్ కమీషన్ పరీక్ష రాశారు ,ఆ పరీక్ష మొత్తం1100 మంది వ్రాయగా వారిలో ఏడుగురిని మాత్రమె ఎంపిక చేశారు ,ఆ ఏడుగురు లో ఒకరు , ఎన్టీఆర్ , ఆ తరువాత ఎన్టీఆర్ సబ్ రిజిస్టర్ గా ఉధ్యోగంలో చేరారు ,కానీ సినిమాలు మీద ఉన్న మక్కువ తో ఆఉద్యోగం మూడు వారలు మించి చేయలేదు .
ఇక ఆయన సినీ రంగ పరిశ్రమ విషయానికి వస్తే .ఎన్టీఆర్ నాటకాలు వేస్తున్న సమయంలో అప్పటి దర్శక నిర్మాతలు అయన నటనకు ఆకర్షితులైయ్యారు .అప్పటి లెజెండరీ డైరెక్టర్ అయిన ఎల్ .వి ప్రసాద్ గారు డైరెక్షన్ లో మన దేశం అనే సాంఘిక తెలుగు సినిమా ద్వారా 1949 వ సవంత్సరం లో చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు .1950 లోపల్లెటూరి పిల్ల చిత్రంలో కూడా నటించడం జరిగింది అదే సవంత్సరం షావుకారు సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించారు .ఆ విధంగా ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది .పౌరాణిక సాంఘీక ,జానపద చిత్రాల్లోని కొన్ని ముఖ్యా అంశాలు చూద్దాం .ఎన్టీఆర్ తన సినీ నటనా జీవితంలో 18 చారిత్రకాలు 55 జానపదాలు 186 సాంఘిక చిత్రాలు , 48 పౌరాణిక చిత్రాల్లో నటించి తెలుగు వెండి తెరపైన ఆయనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు .అంతే కాదు హిందీ లో నయా ఆద్మీ ,చండీ రాణి ,అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించారు.ఎన్టీఆర్ మూడు తరాల పాత్రలను కూడా ఒకే సినిమాలో పోషించిన ఘనత ఆయనకే సొంతం తాతగా ,తండ్రిగా కొడుకుగా ,నటించడం కూడా జరిగింది .
ఇక రాజకీయ రంగ ప్రవేశం విషయానికి వస్తే :
ఎన్టీఆర్ 29 మార్చ్ 1982 లో తెలుగు దేశం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసారు .“తెలుగు దేశం పార్టీ అనేది ” శ్రామికుడు చమటలో నుంచి వచ్చింది కార్మికుడు కరిగిన ఖండరాలలో నుంచి వచ్చింది ” నిరుపేదల కన్నీటి లో నుండి “కష్ట జీవుల్ల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగు దేశం పార్టీ ఆశీర్వదించండి అని ప్రజల దగ్గరకు వెళ్లారు ,9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు.ఇక చివరిగా :: ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థాన్నాన్ని నిర్మించి రూపుదిద్దుకున్న మహానుభావుడు అందుకే అయన మన విశ్వ విఖ్యాత నట సార్వ భోముడు అయ్యారు ఎన్టీఆర్.తెలుగు ప్రజల అశేష అభిమానాన్ని అందుకున్న యుగ పురుషుడు , తెలుగు జాతి యొక్క ఔనత్యాన్ని ప్రపంచ ఖండంతరాలకు తెలియజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అందుకే ఆయనను మనం ఈ రోజు మరొక సారి గుర్తు చేసుకుందాం.