మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన కారులో వ్యక్తి సజీవదహనం కేసులో ట్విస్ట్ నెలకొంది.ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను తెలుసుకొన్నారు.
ఇన్యూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ ను హత్య చేసినట్లు గుర్తించారు.డ్రైవర్ ను సెక్రటేరియేట్ ఉద్యోగి ధర్మానాయక్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
హత్య చేసిన అనంతరం ఈనెల 9వ తారీఖున కారులో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు ధర్మానాయక్ నాటకం ఆడాడని పోలీసులు వెల్లడించారు.ధర్మానాయక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.