అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు అంటే ఒక ఆట బొమ్మల లాగా మారిపోయాయి.ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే అమెరికాలో దాదాపు వారంలో కనీసం రెండు సార్లు అయినా కాల్పులు జరుగుతూ ఉంటాయి.
తాజాగా మరోసారి అమెరికాలో కాల్పులు జరగడం కలకలం రేపింది.గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులలో ఆరు నెలల శిశువు తో పాటు ఆరుగురు మరణించారు.
ఈ ఘటన కాలిఫోర్నియాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలో ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆరు నెలల శిశువు ఆమె తల్లి 17 సహా ఆరుగురు మరణించారు.సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

విసాలియాకు తూర్పున ఉన్న ఇన్‌కార్పొరేటెడ్ గోషెన్‌లో నివాసముంటున్న కుటుంబం పై ఉదయం మూడు గంటల 3.30 నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు చాలాసార్లు కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందడంతో తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.మృతులలో ఇద్దరు వీధిలో, మరో వ్యక్తినీ ఇంటి గుమ్మం వద్ద కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
మరో ముగ్గురు బాధితులు ఇంటి లోపల మిగతా జీవులుగా కనిపించారని వెల్లడించారు.వారిలో ఒకరు ప్రాణాలతో కొట్టు మిట్టు లాడుతుండగా ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తుండగా మరణించారు.
అయితే ఈ హత్యకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఈ కాల్పులు యాదృచ్ఛికంగా జరిపినవి కావని కుటుంబాన్ని టార్గెట్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన హత్య చేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.







