హీరో విజయ్ అంటోనీకి తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు?

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ ఆంటోనీ పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు.

 Vijay Antony Injured Sets Pichaikkaran 2 Kuala Lumpur Details, Vijay Antony, Pic-TeluguStop.com

ఈ సినిమా అప్పట్లోనే విడుదల అయ్యి సంచలన విజయాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత విజయ్ అంటోనీ తర్వాత మళ్లీ ఇతర సినిమాలలో కనిపించలేదు.

ఇకపోతే విజయ్ ప్రస్తుతం హీరోగా అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

కాగా ఆ సినిమాలు అన్నీ కూడా వరుసగా ఈ ఏడాది విడుదల కానున్నాయి.కాగా విజయ్‌ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్‌ తెలుగులో బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది.ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్‌–2 బిచ్చగాడు 2 సినిమా రూపొందుతోంది.

Telugu Pichaikkaran, Bichhagau, Vijay Anthony, Kuala Lumpur, Vijay Antony-Movie

ఇందులో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు అయితే అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.మలేషియా లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.కౌలాలంపూర్‌లో పిచైక్కారన్ 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడ్డాడు.ప్రస్తుతం విజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.షూటింగ్ లో విజయ్ వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది.

Telugu Pichaikkaran, Bichhagau, Vijay Anthony, Kuala Lumpur, Vijay Antony-Movie

ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది.దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

కాగా విజయ్ దర్శకుడు, హీరోగా పిచైక్కారన్ 2 సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం కూడా విజయ్ అందిస్తుండడం విశేషం.

ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube