షూటింగ్ సెట్ లో ప్రమాదం.. కశ్మీర్ ఫైల్స్ నటి పల్లవికి తీవ్ర గాయాలు?

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ లు నటీ నటులలు ఎక్కువగా గాయాల పాలవుతున్నారు.ఇప్పటికే పలువురు నటీనటులు షూటింగ్ సమయంలో జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గాయపడిన విషయం తెలిసిందే.

 Actress Pallavi Joshi Injured On The Vaccine War Sets In Hyderabad Details, Pall-TeluguStop.com

అయితే ఆ సంఘటనలలో కొందరికి చిన్న చిన్న గాయాలు మరికొందరికి అయితే రెండు మూడు నెలల పాటు రెస్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

తాజాగా కూడా బాలీవుడ్ కి చెందిన ఒక నటి సినిమా షూటింగ్ లో భాగంగా గాయపడింది.

ఆమె మరెవరో కాదు నటి పల్లవి జోషి.పల్లవి జోషి ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సతీమణి అన్న విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా ది వ్యాక్సిన్‌వార్‌ సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే సెట్‌లో ఉన్న వాహనం అదుపుతప్పి ఆమెను ఢీకొనడంతో పల్లవి జోషికి గాయాలయ్యాయి.

Telugu Actresspallavi, Bollywood, Vivek Agnihotri, Hyderabad, Pallavi Joshi, Kas

గాయాలతోనే ఆ షాట్‌ను పూర్తి చేశారు పల్లవి.ఆ తర్వాత వెంటనే చిత్ర బృందం ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే నటి పల్లవి జోషి కేవలం సినిమాల ద్వారా కాకుండా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా కూడా ఈమె ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది పల్లవి.

Telugu Actresspallavi, Bollywood, Vivek Agnihotri, Hyderabad, Pallavi Joshi, Kas

కాగా గత ఏడాది విడుదలైన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత పల్లవి జోషి పేరు మారుమోగిపోయింది.అంతేకాకుండా ఈ సినిమా ఈమెకు భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టింది.

దీనికి దర్శకత్వం వహించిన వివేక్‌ అగ్నిహోత్రి ప్రస్తుతం ది వ్యాక్సిన్‌వార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా, ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube