మహమ్మారి కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.చైనా దేశంలో పరిస్థితి మరీ చాలా అధ్వానంగా మారింది.
రోజుకి కొన్ని కోట్లల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.అక్కడి ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో… చైనాలో కరోనా విలయతాండవం చేస్తుంది.
దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.ఇప్పటికే కరోనా కట్టడికి సంబంధించి ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేయడం కూడా జరిగింది.చైనాలో కొత్త కేసులకి ప్రధాన కారణం BF7 అనే కొత్త కరోనా వేరియంట్.
ఈ వేరియంట్ అత్యంత వేగవంతంగా వ్యాప్తి చెందుతూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలో BF7 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేయడం జరిగింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది.అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని తెలిపింది.ప్రజలు కోవిడ్ నుండి సురక్షితంగా ఉండాలంటే ఈ నిబంధనలు పాటించాలని సూచించింది.







