హీరో సుమన్.అతడు సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఎప్పుడు వార్తలో వ్యక్తిగా నిలిచాడు అతనికి జైలు జీవితం ఎంతో నేర్పించింది అని కూడా చెప్తూ ఉంటాడు.
అయితే జైలు నుంచి విడుదలైన తర్వాతే సుమన్ కి అసలు సమస్య మొదలైంది.ఆ టైంలో ఎవ్వరూ కూడా అతనిని నమ్మి సినిమాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు.
ఆ టైంలో జైలు నుంచి ఇంటికి వచ్చి సుమన్ నీ కొన్నాళ్లపాటు చెంగల్పట్టు రోడ్ లో హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు.పైగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి ఆ తర్వాత ఆ పోలీస్ పర్యవేక్షణలోనే షూటింగ్ కి వెళ్ళాలి అనే నిబంధన కూడా పెట్టారు.
అది సరిగ్గా 1988 ఆ టైంలోనే భానుచందర్ దగ్గరికి ఒక కథ వచ్చింది.ఆ టైంలో భానుచందర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అయితే బందిపోటు కథ విన్న తర్వాత అది తన కంటే కూడా సుమన్ కి బాగా సూట్ అవుతుందని నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారికి సూచించాడు భాను చందర్.ఆ సినిమాను ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం చేయగా చిత్రంలో గౌతమి, కల్పనా, పూర్ణిమ వంటి నటీనటులు నటించారు.అలా బందిపోటు సినిమాని సుమన్ కి భానుచందర్ ఇచ్చేసాడు ఆ సినిమా విడుదలైన తర్వాత ఎంతో ఘనవిజయం సాధించింది.
సుమన్ కి ఇది ఒకరకంగా అది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా సుమన్ తనకు రెండో సారి జీవితాన్ని ఇచ్చిన సినిమా బందిపోటు అని దానికి కారణం భానుచందర్ అని చెప్పాడు.మొదటినుంచి సుమన్ కి భానుచందర్ అండగా ఉన్నాడు అసలు తెలుగు సినిమాల్లో నటించాలని సుమన్ నీ మొట్ట మొదటి సారిగా తమ్మారెడ్డి భరద్వాజ కి పరిచయం చేసింది కూడా భానుచందర్ కావడం విశేషం.భానుచందర్ మరియు సుమన్ ఇద్దరూ కూడా మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించారు.
వీరిద్దరి కాంబినేషన్లో అనేక చిత్రాలు వచ్చాయి.వీరి కాంబినేషన్లో వచ్చిన మెరుపు దాడి అనే సినిమా అయితే అప్పట్లో విజయం సాధించడమే కాదు బ్లాక్ బాస్టర్ గా కూడా నిలిచింది.