పుష్ప 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రష్మిక... ఏం చెప్పారంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా 2021 డిసెంబర్ నెలలో విడుదలయి బాక్సాఫీస్ సంచలనాలు సృష్టించింది.

 Rashmika Gave A Key Update On Pushpa 2 What Did She Say, Rashmika ,a Key Update-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి శర గంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోభాగంగా అల్లు అర్జున్ ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు.

అయితే ఈ సినిమా షూటింగులో రష్మిక ఇప్పటివరకు బాగం అవలేదు.దీంతో పుష్ప సీక్వెల్ సినిమాలో రష్మిక లేదని వార్తలు పుట్టుకొచ్చాయి.

రష్మిక బదులు వేరే హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతుందని వార్తలు వచ్చాయి.రష్మిక కూడా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో ఈ సందేహాలు వ్యక్తం అయ్యాయి.అయితే ఈమె నటించిన మిషన్ మజ్ను వారసుడు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లతో రష్మిక బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పుష్ప 2 గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని వచ్చే నెలలో తాను కూడా ఈ సినిమా షూటింగ్లో భాగం కాబోతున్నానని ఈమె ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.ఇక ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిందని సెకండ్ పార్ట్ లో స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి తాను చాలా ఎగ్జైట్ గా ఉన్నానని రష్మిక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇలా రష్మిక పుష్ప 2 గురించి అప్డేట్ ఇవ్వడంతో ఈమె గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube