మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించాడు.
ఈ సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ విదేశాల్లో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి ప్రేక్షకులను కూడా తన స్టైల్ తో మెప్పిస్తున్నాడు.
తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో పాటు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కలిసి యూఎస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.ఈ జంట కొన్ని రోజుల క్రితమే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం అక్కడికి వెళ్లారు.

మరి ఈ అవార్డ్స్ లో మన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ వేడుకలు ముగియడంతో రామ్ చరణ్ జంట తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు.ఇక ఇప్పటి వరకు వెకేషన్ పూర్తి అవ్వడంతో ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్న సినిమాపై చరణ్ ఫోకస్ పెట్టనున్నాడు.ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.
ఈయన లైనప్ లో ఉన్న ఫస్ట్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్.

శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.
దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.







