మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ ఫుల్ పూనకాలతో ఊగిపోతారు అనే విషయం తెలిసిందే.ఇక దసరా పండుగకు వచ్చి గాడ్ ఫాదర్ సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న చిరు ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.
ఈ శుక్రవారం జనవరి 13న సంక్రాంతి కానుకగా చిరు తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మెగాస్టార్ నటించిన ”వాల్తేరు వీరయ్య” సినిమా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది అనే చెప్పాలి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు.చిరు, మెగాస్టార్ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే వీరయ్య నే ప్రేక్షకులను ఎక్కువుగా మెప్పించాడు అని టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక సంక్రాంతి పండుగ కావడంతో హాలిడేస్ ను వీరయ్య బాగా క్యాష్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని దూసుకు పోతుంది.నిన్నటికే ఈ సినిమా 1.6 మిలియన్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.అతి త్వరలోనే 2 మిళియన్లను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మెగాస్టార్ నటించిన సైరా 2.6 మిలియన్ డాలర్స్ తో టాప్ లో ఉంది.మరి ఇప్పుడు వీరయ్య ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.







