హర్నాజ్ సంధు.ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
భారతదేశానికి చెందిన 21 ఏళ్ల నటి మోడల్ అయిన హర్నాజ్ సంధు గురించి మనందరికీ తెలిసిందే కాగా ఈమె 2021 ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 టైటిల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దాదాపుగా 20 సంవత్సరాల తరువాత హర్నాజ్ సంధు మన దేశానికి కిరీటాన్ని తీసుకువచ్చింది.
ఈమె మిస్ యూనివర్స్ గా గెలవడంతో ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.అందాల పోటీలో ఈ భారతీయ ముద్దుగుమ్మ అనూహ్య విజయం సాధించి మిస్ యూనివర్స్ కిరీటాన్నీ సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉండే తాజాగా హర్నాజ్ సంధు ఒక్కసారిగా ఎమోషనల్ అయింది.అంతేకాకుండా ఆమె స్టేజి పైనే కింద పడిపోబోయింది.కాగా ప్రపంచం అందాల పోటీల్లో ప్రతిస్టాత్మకంగా భావించే విశ్వసుందరి పోటీలు తాజాగా అమెరికాలోని లూసియానాలో న్యూ ఓర్లిన్స్ వేదికగా జరిగాయి.అయితే ఈ వేడుకలలో 80 దేశాలకు చెందిన అందాల భామలు తలపడిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారతీయ ముద్దుగుమ్మ అయిన మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు.
పాల్గొంది.అక్కడ జరిగిన ఆ పోటీలను ఆమె దగ్గరుండి వీక్షించారు.
అయితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ ని ప్రకటించే సమయంలో స్టేజ్ పైకి వచ్చిన ఆమె మిస్ యూనివర్స్ హోదాలో చివరిసారిగా ర్యాంపు పై వాక్ చేసింది.

సమయంలో ఆమె అంత మంది ఆమె పై ప్రేమాభిమానాలు కురిపిస్తుండడంతో కన్నీరు పెట్టుకుంది.అందర్నీ చూస్తూ ఏడుస్తూనే ఎమోషనల్ అవుతూ కంట్రోల్ చేసుకుంది.ఈ క్రమంలోనే ముందుకు వెళ్లి అభివాదం చేస్తుండగా స్టేజ్ మీద కింద పడిపోబోయింది.
ఆ తర్వాత వెంటనే యాక్టివ్ అయ్యి తిరిగి మళ్లీ ఆమె వాకింగ్ కొనసాగించింది.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







