ఏపీలో గత కొంత కాలంగా.రాజకీయాలు హీటెక్కాయి.
అంతే కాకుండా ప్రతిపక్షాలు అన్నీ అప్పుడే కూటములపై చర్చలు మొదలు పెట్టాయి.ఇందులో భాగంగా.
వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అంటూ.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు.
చిన్నా చితకా సభలు ప్రారంభించి.భారీ స్థాయి సభలు నిర్వహిస్తున్నారు.
టైమ్ దొరికిన ప్రతీ సారీ.ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.
దూసుకు పోతున్నారు.
సోషల్ మీడియాలో సైతం.
నిత్యం పోస్టులు, లేఖలు విడుదల చేస్తూ.నిత్యం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటారు.
రాష్ట్రంలో 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత.పవన్ కమ్యూనిస్టులను పక్కన పెట్టి మరీ.బీజేపీ పంచన చేరారు.అయితే అప్పటి నుంచి జనసేన ఊపు భారీగా పెరిగింది.
అడపాదడపా విమర్శలు దగ్గరి నుంచి.భారీ డైలాగులు వేసే స్థాయికి పవన్ చేరారు.
ఇక బీజేపీ కూడా.పవన్ ను ఉపయోగించుకుని.
రాజకీయాల్లో ఎదగాలని ప్లాన్ చేసింది.

దాంతో ఆయన చెప్పిన ప్రతీ దానికి తలూపుతూ వచ్చింది.అయితే లాస్ట్ మినిట్ లో పవన్ బీజేపీకి హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.పొత్తుల విషయంలో కేవలం చంద్రబాబుతో మాత్రమే మంతనాలు జరుపుతూ.
బీజేపీని పక్కన పెట్టేశారు.దాంతో అప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు పవన్ పై గుర్రుగా ఉన్నారు.
ఇక అడపా దడపా మాటు అంటున్నా.పూర్తిగా పవన్ పై మాత్రం విమర్శలు చేయలేదు.

ఇక సహనం నశించింది కాబోలు.ఏకంగా అధ్యక్షుడే పవన్ ను హెచ్చరించారు.ఆయన మాటలు కొత్తగా ఉన్నాయని.కొంచం స్పష్టత ఇస్తే బాగుంటుందని చురకలంటించారు.వపన్ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉండబోతున్నాయన్నారు.దీన్ని బట్టి చూస్తే.
పవన్ పొత్తులపై బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.మరి ఎన్నికల నాటికి అయినా పవన్ తన మనసు మార్చుకుని.
బీజేపీని చేర్చుకుంటారా.? లేక టీడీపీతో మాత్రమే కలసి వెళతారా చూడాలి.








