ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.జనసేనాని పవన్ కల్యాణ్ ను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందిగా సూచించారు.
ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోకపోతే తన పార్టీలోకి చేరాలని పాల్ కోరారు.చంద్రబాబు, జగన్ లు కలిసి ఏపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా పవన్ కల్యాణ్ పెయిడ్ కార్యాక్రమాలు చేస్తుంటారని విమర్శించారు.ఏపీలో పవన్ వలనే ఓట్లు చీలుతున్నాయని మండిపడ్డారు.