మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా ఈ రెండు తప్పనిసరిగా ఉండాల్సిందే.వీసా లేకుండా మరో దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.
కానీ కొన్ని దేశాలు తమ విమానాశ్రయాలు దిగిన తర్వాత వీసా మంజూరు చేస్తూ ఉంటాయి.ఇంకొన్ని సన్నిహిత శ్రేయోభిలాషి దేశాలు వీసా లేకపోయినా పరస్పరం తమదేశాల ప్రజలు వచ్చి పోవడానికి అనుమతిని ఇస్తూ ఉంటాయి.
విసల సంగతి ఇలా ఉంటే పాస్పోర్ట్ లో అత్యంత శక్తివంతమైన, శక్తివంతమైన, బలహీనమైన పాస్పోర్ట్లు ఉండడం కొంత ఆసక్తిని కలిగిస్తున్న అంశమే.
గత 20 సంవత్సరాలుగా శక్తివంతమైన పాస్పోర్ట్ అందించే దేశాల జాబితాలను లండన్ కు చెందిన అంతర్జాతీయ పౌరాసత్వ నివాస సలహా సంస్థ పార్ట్నర్స్ ప్రకటిస్తూ వస్తుంది ఈ క్రమంలోనే తాజా జాబితా ప్రకటించింది.ప్రపంచ దేశాల్లో జపాన్ పాస్ పోర్ట్ ను అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా గుర్తించింది.జపాన్ మొదటి స్థానంలో ఉండగా, సింగపూర్, దక్షిణ కొరియాలో రెండు రెండో స్థానంలో, జర్మనీ, స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి.
ఇక అగ్రరాజ్యంగా చెప్పే అమెరికా, బ్రిటన్, చైనా లాంటి దేశాలు ఆ తర్వాతే స్థానాలలోనే వెనకబడి ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే మన దేశం 59 దేశాలతో 85వ స్థానంలో ఉంది.
మొదటి స్థానంలో నిలిచిన జపాన్ పాస్ పోర్ట్ తో గరిష్ట స్థాయిలో 193 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరవల్ పద్ధతిలో సందర్శించే అవకాశం ఉంది.సింగపూర్, దక్షిణ కొరియా రెండవ స్థానంలో పాస్ పోర్ట్ తో 192 దేశాలు, జర్మనీ, స్పెయిన్ పాస్పోర్ట్ తో 190 దేశాలను అదే పద్ధతిలో సందర్శించే అవకాశం ఉంటుంది.ఫిన్లాండ్, ఇటలీ నాలుగో స్థానంలో ఉండగా ఈ దేశాల పాస్ పోర్ట్ తో 189 దేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పించాయి.ఇంకా చెప్పాలంటే 85వ స్థానంలో ఉన్న మన దేశ పాస్ పోర్ట్ తో 59 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది.