టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.గత కొన్ని రోజుల నుండి తన పరిచయాన్ని సోషల్ మీడియాతో బాగా పెంచుకుంది.
ఎన్నో సినిమాలలో వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా యాంకర్ గా కూడా పని చేసింది.
ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
గతంలో తన భర్త మరణించిన తర్వాత ఎన్నో రకాల పుకార్లు ఎదుర్కొంది.
రెండో పెళ్లి చేసుకుంటుందని బాగా పుకార్లు వచ్చాయి.ఆ సమయంలో ఆ పుకార్లకు తన కూతురు సుప్రీత ఫుల్స్టాప్ పెట్టింది.
ఇక అప్పటి నుంచి సుప్రీతతో పాటు సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.తమకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.
పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.తన కూతురుతో కలిసి సురేఖ వాణి తరచుగా పార్టీలని తిరుగుతూ బాగా బిజీగా ఉంటుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలతో కూడా హీరోయిన్ లా తయారవుతుంది సురేఖ.తెగ డాన్సులు చేస్తూ తన అందాలతో అందర్నీ పిచ్చెక్కిస్తుంది.లేటు వయసులో కూడా గ్లామర్ గా తయారవుతుంది సురేఖ వాణి.
అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇక ఆమె ఏదైనా ఫొటో షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇక కొన్నిసార్లు తన పోస్టులను చూసి కొందరు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.
అయినా కూడా పట్టించుకోకుండా బాగా రెచ్చిపోతుంటారు ఈ తల్లి కూతురు.సుప్రిత కూడా సోషల్ మీడియాలో ఎంతలా రెచ్చిపోతుంటుందో అందరికీ తెలిసిందే.
ఇక ఇదంతా పక్కన పెడితే సురేఖవాణి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పంచుకుంది.అందులో తాను కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించగా రోడ్లు ఖాళీగా ఉండటంతో ఒక సెల్ఫీ వీడియో షేర్ చేసుకుంది.ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా అందరూ ఊర్లల్లోకి వెళ్ళటంతో హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీగా ఉంది.దీంతో ఎప్పుడు రద్దుగా ఉండే హైదరాబాద్ సిటీ ఖాళీగా ఉండటంతో ఈ సమయంలో రోడ్లపై తిరుగుతే బాగుంటుంది అంటూ సురేఖ వాణి వీడియో ద్వారా తెలిపింది.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా కొందరు ఆమెపై మళ్లీ ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు.
ఇక సురేఖ వాణి ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కూతురుతో సమయాన్ని కేటాయిస్తుంది.కథ నా కూతురు సుప్రీతను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి బాగా ప్రయత్నిస్తుంది సురేఖవాణి.
ఆ మధ్యనే సుప్రీత ఒక సినిమాతో అడుగుపెట్టగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక భవిష్యత్తులో హీరోయిన్ అవ్వడం కోసం మాత్రం సుప్రీత బాగా ఎక్స్పోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.